గత రెండు రోజులుగా నలుగుతున్న విషయం ఒకటి ఉంది.  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఉండవల్లి ప్రజావేదికను తన నివాసంగా ఇవ్వమని సీఎం హోదాలో జగన్ కి రెక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశారు. అదలా ఉండగానే వైసీపీ నేతలు కూడా తమ పార్టీకి ప్రజావేదిక భవనం కావాలని కోరారు.

 

ఈ రెండు ప్రతిపాదనలు సీఎస్ వద్ద ఉండగానే చంద్రబాబు ఇపుడు ఉండవల్లిలోని తన నివాసాన్ని ఖాళీ చేసేసే పరిస్థితి ఏర్పడింది. జగన్ ఒక్క మాట కూడా మాటాడకుండానే పని అలా జరిగిపోతోంది. బాబు అలా లెటర్ రాసారో లేదో ఇలా జగన్ పార్టీ వాళ్ళు ఉండవల్లి ప్రజావేదిక భవనం అడగడం వెనక పెద్ద ఎత్తుగడ ఉంది. ప్రజావేదిక ఎటూ అధికార పార్టీకే సీఎస్ ఇస్తారు.

 

ఇక అక్కడికి జగన్ సీఎం హోదాలో వస్తే బాబు గారి నివాసం మొత్తం ట్రాఫిక్ నిబంధనల పరిధిలోకి వస్తుంది. ఓ విధంగా అది ఇబ్బందికరమైన అంశమే. దానికి తోడు టీడీపీ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఆ పార్టీ నాయకులకు ఇబ్బందే. ఈ నేపధ్యంలో బాబుకు పొమ్మనకుండా పొగ పెడతామని చెప్పినట్లైంది. ఇక ప్రజావేదికతో పాటు బాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమని వైసీపీ తన విన్నపంలో స్పష్టంగా పేర్కొంది. దాంతో అది ఎపుడు కూల్చేసినా తాము ప్రజావేదికను ఖాళీ చేస్తామని చెప్పుకొచ్చింది.

 

దాని అర్ధం బాబు ఉంటున్న అక్రమ కట్టడం కూల్చేస్తామని చెప్పడమే. దీన్ని బాగా అర్ధం చేసుకున్న చంద్రబాబు ఇపుడు ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాబు ఒక ఎత్తు వేస్తే జగన్ మరో ఎత్తు వేసి చిత్తు చేశారు ఇపుడు  బాబుకు అమరావతిలో ఇల్లు లేదు. విజయసాయిరెడ్డి అన్నట్లుగా సొంత ఇల్లు లేకుండా ఇన్నాళ్ళు పాలించారా అన్న మాట వినిపిస్తోంది. ఇకపైన అద్దెకు ఉంటారేమో అక్కడ చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: