2019 లో ప్రత్యక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసాడు నారా లోకేశ్. ముందుగానే సర్వేలు చేయించి అనుకూలమైన నియోజకవర్గమని భావించిన తరువాతే నారాలోకేష్ ఎన్నికల్లో పోటీ చేసాడు. ముఖ్యమంత్రి కొడుకైనప్పటికీ ఈనియోజకవర్గంలో ఐదు వేల ఓట్ల తేడాతో నారా లోకేష్ ఓడిపోయాడు. 

ఎన్నికల్లో గెలిచి ఉంటే నారాలోకేశ్ పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఓడిపోవటంతో ఇప్పుడు నారాలోకేశ్ పరిస్థితి అయోమయంలో పడింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ పార్టీపై పట్టు పెంచుకోవాల్సిన అవసరం లోకేశ్ పై ఉంది. మరి కొన్ని రోజుల్లో పంచాయితీ మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడినప్పటికీ తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికలలో వైసీపీ పార్టీకి గట్టి పోటీ ఇస్తే పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది.నారా లోకేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీపై పట్టు సాధిస్తే అది పార్టీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: