ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి గురించి సీఎం నుండి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. జూన్ నెలలో అన్ని పథకాలకు నిధులు మంజూరైనా ఈ పథకానికి మాత్రం నిధులు అందలేదు. సీ ఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో రెండు నెలల్లో 5 లక్షల 60 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుండడతో ఈ పథకం కొనసాగకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

4 లక్షల గ్రామ వాలంటీర్లు, లక్ష అరవై వేల పోస్టులు సచివాలయంలో భర్తీ చేయనున్నారు. అగస్ట్ నెల లోపు గ్రామ వాలంటీర్లకు, అక్టోబర్ 2 లోపు గ్రామ సచివాలయానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ఇందుకోసం అధికారులు ప్రస్తుతం నియమ నిభంధనలు రూపొందించే పనిలో ఉన్నారు.

నిరుద్యోగులు మాత్రం కనీసం ఆగస్ట్ వరకైనా ఈ పథకాన్ని కొనసాగించి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పత్జకం వల్ల తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం ఉందదని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: