సెంటిమెంట్లు ముందు పుట్టి మనిషి పుట్టాడేమోననిపిస్తుంది. అయిన దానికీ కాని దానికీ సెంటిమెంట్ ఆయింటుమెంట్ లా పూసేసుకుని పూనకం పోతున్న బాపతు జనాభా ఎక్కువే సుమీ. ఇక రాజకీయ, సినీ రంగాల్లో అయితే ఈ సెంటిమెంట్ చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి అంటుకుంటే వదిలిపోయేది కాదిది.


ఇంతకీ సంగతేంటంటే జగన్ సర్కార్ కొత్త మంత్రులను తీసుకుంటోంది. దాంతో పాటే శాఖలూ కేటాయిస్తారు. అయితే తమకు దేవాదాయ శాఖ వద్దు బాబోయి అంటూ చాలా మంది ఇప్పటికే జగన్ కి చెప్పేస్తున్నారుట. దేవాదాయ శాఖ తీసుకున్న వారిలో ఇంతవరకూ ఎవరూ రాజకీయంగా బతికి బట్టగట్టలెదని అంటున్నారు. ఆఖరుకు  చివరాఖర్లో ఈ శాఖను చూసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తాజా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతిని గుర్తు చేస్తున్నారుట.


అదే విధంగా స్పీకర్ పదవి కూడా వద్దు అనేస్తున్నారు. ఈ అత్యున్నతమైన రాజ్యాంగ పదవిని చేసిన వారు కూడా రాజకీయంగా పూర్తిగా  మూలకు చేరారన్న సెంటిమెంట్ తోనే మేము ఆ కుర్చీలో కూర్చోమని నిర్మొహమాటంగా  చెప్పేస్తున్నారుట. ఈ పరిణామాలతో కొత్త మంత్రులను ఎంపిక చేయడమే కష్టంగా ఉన్న జగన్ కి శాఖల కేటాయింపు కూడా ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: