వాహనాలకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియాన్ని పెంచుతూ భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్ డీఏఐ) నిర్ణయం తీసుకుంది. ప్రతి వెహికిల్ కు థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తప్పనిసరిగా ఉండాలి. ఉత్తర్వులు జారీ అయ్యాయి..  పెరిగిన ప్రీమియం 2019, జూన్ 16 నుంచి అమల్లోకి వస్తుంది.


పెరిగిన ధరల ప్రకారం వెయ్యి సీసీలోపు కార్లకు రూ.2 వేల 72 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి నుంచి 1500 సీసీ మధ్య ఉన్న కార్లకు రూ. 3వేల 221 ప్రీమియంగా నిర్ణయించారు. 1500 సీసీ సామర్థ్యం పైన ఉన్న కార్లకు రూ.7 వేల 980 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కొత్త కార్లకు 3 ఏళ్లు తప్పనిసరి థర్డ్ పార్టీ బీమా పాలసీ తీసుకోవాల్సిందే. 1000 సీసీ లోపు కార్లకు రూ.5 వేల 286 ప్రీమియం ఉంది. 1000-1500సీసీ కార్లకు రూ.9 వేల 534 ప్రీమియం, ఆపైన సీసీ ఉన్న కార్లకు రూ.24 వేల 305 ప్రీమియం కట్టాలి.


కొత్త బైకులకు ఐదేళ్ల థర్డ్ పార్టీ ప్రీమియం తీసుకోవాల్సిందే. 75 సీసీ లోపు బైక్ లకు రూ.1,045 ప్రీమియం ఉండగా.. 75-150సీసీ బైక్ లకు రూ.3 వేల 285 ప్రీమియం నిర్ణయించారు. 150-350 సీసీ బైక్ లకు రూ.5 వేల 433 ప్రీమియం కాగా.. ఆపైన సీసీ ఉన్న బండ్లకు రూ.13 వేల 34 థర్డ్ పార్టీ ప్రీమియం చెల్లించాలి..  పాత వాహనాలకు ప్రీమియం స్వల్పంగా పెరిగింది..


మరింత సమాచారం తెలుసుకోండి: