ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (వైఎస్సార్‌ఎల్పీ) సమావేశం ప్రారంభమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు జగన్‌ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పునకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలనే దానిపై ప్రధానంగా ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. 


కాగా  వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గాన్ని ఈ నెల 8వ తేదీన విస్తరించనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ఎల్పీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 8వ తేదీన 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ మంత్రి వర్గంలో 15 మంది పేర్లు వినబడుతున్నాయి.  వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ముడునూరి ప్రసాద రాజు, పిల్లి సుభాష్ చంద్ర బోస్,  అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల రామకృష్ణ రెడ్డి, కొడాలి నాని, దాడిశెట్టి రాజా, అవంతి శ్రీనివాస, మేకపాటి గౌతమ్ రెడ్డి, సుచరిత, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, పెట్ల ఉమ శంకర్ గణేష్ పెర్లు వినబడుతున్నాయి.


ఈ రోజు జరగుతున్న వైఎస్ఆర్ఎల్పీ సమావేశంలో మరో వీరు మంత్రి పదవులు స్వీకరిస్తారో లేదో తెలుస్తుంది. ఇదిలా ఉంటో మరో 10 మందిని కూడా ఈ రోజే ప్రకటించే అవకాశముంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సెక్రటెరియట్ లో మంత్రుల ప్రమాణ స్వీకారాణికి పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కొత్తగా నియమితులయ్యే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు, దానికి సంబందించిన పనులకు ఇప్పటికే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సెక్రటెరీయట్ ముస్తబవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: