- దరఖాస్తు చేసింది 13.93 లక్షల మంది నిరుద్యోగులు  
- 5,02,579 మందికే నిరుద్యోగభృతి 
- మిగిలిన 8,91,262 నిరుద్యోగుల అప్లికేషన్లు ఇప్పటికీ పెండింగ్లోనే  


ఎన్ టి ఆర్ నిరుద్యోగ భృతి కోసం పెట్టిన 30,816 దరఖాస్తుల ఇప్పటికీ  పెండింగ్లోనే ఉన్నాయి.  13.93 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. ఏడాది క్రితం దరఖాస్తు చేసిన నిరుద్యోగ భృతి పొందని  నిరుద్యోగులు లక్షల్లోనే ఉన్నారు. అప్లికేషన్లు వివిధ సమస్యలతో పెండింగ్ లో ఉన్నాయి. అర్హులైన నిరుద్యోగులు జూన్ నెలలో వారి నిరుద్యోగ భృతి ప్రయోజనం పొందలేకపోయారు. కానీ, కొత్త నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ ఇప్పటికీ  కొనసాగుతోంది. ఈ పథకాన్ని కొనసాగుతుందా... లేదా ... అనే  అనుమానాలు  తలెత్తుతున్నాయి.
'ఎన్.టి.ఆర్ నిరుద్యోగ భృతి' ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కింద  మే 2017 లో ప్రకటించబడింది. అయితే, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 2018 లో ఈ పథకాన్ని  ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తాం పథకం కోసం ప్రభుత్వం ఒక వెబ్సైట్ను నిర్వహిస్తోంది. అప్పటి నుండి, ఈ నెల 6 వ తేదీ వరకు  13,93,840 మంది నిరుద్యోగ యువత ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 5,02,579 మాత్రమే అర్హత కలిగి ఉన్నట్టు  ప్రభుత్వం గుర్తించింది. 
మిగిలిన 8,91,262 నిరుద్యోగ యువత అప్లికేషన్లు సంవత్సరం నుంచి  పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 6 వ తేదీ నాటికి సుమారు 30,691 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)  వెబ్సైట్ ఆన్లైన్లో చూపిస్తోంది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది , నూతన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు రోజల అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు చిత్రాన్ని ఆర్ టి జి ఎస్ వెబ్సైట్ నుంచి తొలగించింది. కానీ కొత్త CM చిత్రం ఇప్పటికీ ఆన్లైన్ స్రీన్ పై  ఇంకా ఏర్పాటు చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: