జగన్మోహన్ రెడ్డి సంలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటి, కాపు సామాజికవర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కేటాయించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఎల్పీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

తన ప్రభుత్వంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, కాపులకు 50 శాతం పదవులు కేటాయిస్తానని పాదయాత్రలో  హామీ ఇచ్చారు. అప్పటి హామీ ప్రకారమే మంత్రిపదవుల్లో సమతూకం పటించేట్లుగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా తీసుకోనున్నట్లు చెప్పారు. కాకపోతే పై సామాజికవర్గాల్లో ఎవరెవరిని ఉప ముఖ్యమంత్రులుగా తీసుకునే విషయంలో మాత్రం క్లారిటి లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: