పొంతనలేని ముచ్చట్లు, అడ్డదిడ్డమైన సమాధానాలతో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ వ్యవహరిస్తున్న తీరుతో సైబర్‌ క్రైం పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఆధారాలు చూపుతూ ప్రశ్నలు సంధిస్తున్నా..

నోరు మెదపకపోవడంతో పోలీసులు అవకాక్కవుతున్నారు. సంతకాల ఫోర్జరీ, నకిలీపత్రాలు , డాటా చోరీ ఆరోపణలపై నమోదైన కేసుల్లో రవిప్రకాశ్‌ను మూడోరోజూ, ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆయనను విచారించారు. మంగళ, బుధవారాల్లో పోలీసులు అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్‌ నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు.

దీంతో దర్యాప్తు అధికారులు గురువారం వ్యూహం మార్చి, మరో యాంగిల్‌లో ప్రశ్నలడిగారు. సంతకాల ఫోర్జరీ, పాత తేదీలతో డాక్యుమెంట్లు స ష్టించినట్టు లభించిన ఆధారాలు, రవిప్రకాశ్‌కు ఇతరులకు జరిగిన ఈ-మెయిల్‌ సంభాషణలు, టీవీ9 మాజీ ఉద్యోగి మూర్తి చెప్పిన సమాచారం, టీవీ9 కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు ... తదితర ఆధారాలను పట్టుకుని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. 

ఒక అంశంపై ప్రశ్న అడిగిన తర్వాత ఆయన చెప్పే సమాధానం సరైనవిధంగా లేకపోతే వెంటనే ఆధారాలు చూపుతూ మరింత లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వార్తలు మీద సోషల్‌ మీడియాలో ఫన్నీ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. రవిప్రకాశ్‌ టీవీ 9 వీక్షకులకు విసిగించినట్టే, పోలీసులకు షాక్‌ ఇస్తున్నాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: