ఇదీ ఇపుడు టాక్‌ ఆఫ్‌ ది తిరుమల తిరుపతి ....
 తిరుమల కొండపైనే గత 8 ఏండ్లుగా సెటిల్‌ అయిపోయిన అధికారి ఆయన.
అక్కడి నుండే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చూశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు.... 
ఇటీవల నూతన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ఏకంగా 50 మందికిపైగా ఐఏఎస్‌ లను బదిలీ చేశారు. చంద్రబాబు సర్కారుతో అత్యంత సన్నిహితంగా ఉన్న సతీష్‌ చంద్ర లాంటి వారికి ఇంకా పోస్టింగ్‌ లు కూడా ఇవ్వకుండా పక్కనపెట్టారు.కానీ, ఈ తిరుమల కొండ మీద సెటిల్‌ అయిపోయిన 'జె ఈ వో' ని మాత్రం కదిలించ లేక పోయారు. 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జెఈవో పదవి అంటే మామాలుది కాదు. దేవుడి దర్శనానికి వచ్చిన ప్రముఖులు ముందుగా 'ఆ సారు' దర్శనం చేసుకుంటారట... 

ఆయన ఆ పదవిలోకి వచ్చి, ఎనిమిదేళ్ళు దాటిపోయింది. ప్రభుత్వాలు పోతున్నాయి..వస్తున్నాయి. కానీ ఆయన మాత్రం అక్కడ నుంచి మారటం లేదు.  ఎంతో కీలకం అయిన పోస్టింగ్‌ ల్లో ఏ ఉన్నతాధికారిని మూడేళ్లకు మించి ఉంచరు. కానీ ఎంతో పరపతి..ప్రముఖుల రికమండేషన్‌ ఉంటేనే గానీ, ఎనిమిదేళ్ళకు పైగా ఆ పదవిలో కొనసాగ లేరు...?

 జెఈవో గారి వ్యవహారశైలిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ,టీటీడీ సర్కారు ఐదేళ్ల పాటు ఆయన్ను కదిలించలేకపోయింది. కారణం ఆయనకు దేశంలోనే అత్యంత శక్తివంతమైన పారిశ్రామికవేత్త ల సపోర్ట్‌ ఉందంటారు. మరో సారి సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి సిఫారసుతో జెఈవో గారి బదిలీ ఆగిపోయిందని అనధికార సమాచారం. 
సీఎస్‌ గా ఎల్వీ సుబ్రమణ్యం వచ్చిన కొద్దిరోజుల కే , జెఈవో సెలవు పెట్టి వెళ్ళారు. మళ్ళీ వచ్చారు.
ఇప్పుడు ఆయన నిశ్చింతగా కొండపై స్వామివారి సేవలో కూల్‌గా కొనసాగుతున్నారు.
సీన్‌ చూస్తుంటే కొండమీది వెంకన్న కూడా శ్రీనివాసరాజును అక్కడ నుంచి మార్చలేరా?అని పిస్తోంది...?


మరింత సమాచారం తెలుసుకోండి: