ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఊహించని ట్విస్టులు ఇవ్వ‌డంతో పాటు సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కేబినెట్ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా, అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా ఉంటోంది. జ‌గ‌న్ కేబినెట్‌లో దేశ రాజ‌కీయాల చ‌రిత్ర‌లోనూ ఏ సీఎం చేయ‌న‌ట్టుగా ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు.


శుక్రవారం ఉదయం వైసీపీఎల్పీ  సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈ ఐదుగురిలో వైసీపీ సీనియర్ నేత, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి కాపు కోటాలో, బీసీ కోటాలో పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థికి, ఎస్టీ కోటాలో సాలూరు ఎమ్మెల్యే పీడిక‌ల రాజ‌న్న‌దొర‌కు, మైనార్టీ కోటాలో క‌డ‌ప ఎమ్మెల్యే అంజాద్‌భాషాకు, ఎస్సీ కోటాలో గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే పీడికల రాజ‌న్న‌దొర‌ల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ద‌క్కనున్న‌ట్టు తెలుస్తోంది.


సుచ‌రిత అరుదైన రికార్డు :
గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేక‌తోటి సుచరిత‌కు ఎస్సీ + మ‌హిళా కోటాలో మంత్రి ప‌ద‌వి రానుది. ఇదే క్ర‌మంలో ఆమెను జ‌గ‌న్ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కూడా చేయ‌నున్నారు. ఏడు ద‌శాబ్దాలు తెలుగు రాజ‌కీయాల చ‌రిత్ర‌లో ఓ మ‌హిళ‌ను అది కూడా ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ను ఏకంగా ఉప ముఖ్య‌మంత్రిగా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికే ద‌క్క‌నుంది. అలాగే ఏకంగా ఐదుగురిని ఉప ముఖ్య‌మంత్రిగా చేయ‌డం కూడా ఓ రికార్డే.


మరింత సమాచారం తెలుసుకోండి: