రోజా నగరి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా కామెడీ ప్రోగ్రామ్ జబర్దస్త్ లో జడ్జి గా ఉంటున్నది.  గతంలో అంటే వైకాపా అధికారంలో లేదు.  ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చింది. అయినాకానీ, రోజా, ఇలా జబర్దస్త్ లో కొనసాగటానికి కారణం ఏంటి అనే దానిపై అనేకమంది అనేక కామెంట్లు చేస్తున్నారు.  
రోజువారి పొలిటికల్ టెన్షన్ నుంచి కొద్దిగా రిలీఫ్ కావడానికి జబర్దస్త్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  కామెడీ పంచ్ లతో జబర్దస్త్ ఒకటిగా ఉంది.  అందుకోసమే ఈ ప్రోగ్రామ్ ను చేస్తున్నట్టు రోజా గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.  మొన్నటి వరకు ఎన్నికల్లో బిజీగా ఉన్న నాగబాబు కూడా జబర్దస్త్ కు రిటర్న్ బ్యాక్ అంటున్నారు.  
జనసేన తరపున ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓటమిపాలయ్యారు.  దీంతో నాగబాబు తిరిగి జబర్దస్త్ కు వచ్చేందుకు రెడీ అయ్యారు.  అయితే, ఇప్పుడు మరో విషయం అందరిని ఆలోచనలో పడేసింది.  రోజాకు మంత్రి పదవి లేదంటే, స్పీకర్ పదవి ఇచ్చేందుకు వైకాపా సిద్ధం అయ్యింది.  ఇలాంటి సమయంలో రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కొనసాగుతుందా లేదా అన్నది తెలియాలి.  
ఒకవేళ రోజా కొనసాగకపోతే.. ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారు అన్నది తెలియాలి. మీనా కొన్ని రోజులు చేసింది.  సంఘవి కొన్ని రోజులు చేసింది.  కానీ, ఆ కార్యక్రమానికి వన్నె తెచ్చింది మాత్రం రోజానే.  రోజా లేకుంటే జబర్దస్త్ లేదు అనే విధంగా మారిపోయింది. అలాంటప్పుడు రోజా లేకుంటే జబర్దస్త్ ఏమౌతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: