ఈ మద్య సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మంచి కన్నా అనర్థాలే ఎక్కువ అవుతున్నాయి.  చిన్న ఏజ్ నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పని సరిగా మెయింటేన్ చేస్తున్నారు.  అయితే ఇది కమ్యూనికేషన్ కోసమైతే ఒకే, కానీ దానికన్నా మించిన దరిద్రమైన పనులకు ఉపయోగిస్తున్నారు. ఇక సెల్ ఫోన్ అందులో ఇంటర్ నెట్..ఇంకాస్త లోపలికి వెళితే ఫోర్న్ ప్రపంచం.

ఇది ఇప్పుడు యూత్ మెయింటేన్ చేస్తున్నది..అయితే ఇలాంటి వాటి వల్ల తమ కెరీర్, చదువు సర్వనాశనం అవుతున్నాయని మేథావులు నెత్తీనోరు బాదుకుంటున్నా..తమ లైఫ్ స్టైల్ మార్చలేం అంటున్నారు యూత్.  ఇక ఆ మద్య ఓ హాస్టల్ లో దాదాపు నలభై మంది అమ్మాయిలను నగ్నంగా స్నానం చేస్తుండగా వీడియో షూట్ చేశాడు..అతని వయసు కేవలం 14 సంవత్సరాలు..ఇలా ఎంతో మంది చిన్న వయసు వారు కూడా ఫోర్న్ ప్రపంచానికి అలవాటు పడిపోతున్నారు.  తాజాగా మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వ్యక్తికి ఐదేళ్ల తర్వాత శిక్ష పడింది.

హైదరాబాద్‌లోని చింతల్‌లో 19 ఏప్రిల్ 2014లో ఈ ఘటన జరిగింది. చింతల్‌కు చెందిన మహిళ బాత్రూంలో స్నానం చేస్తుండగా అవినాశ్ రెడ్డి అనే వ్యక్తి దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాత నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: