రోజా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వైకాపాలో చాలా మార్పులు జరిగాయి.  పార్టీ పెట్టక ముందు నుంచే వైకాపాలో ఆమె ఉన్నారు.  అసెంబ్లీ జరిగిన అనేక సంఘటనలను ఆమె ఎదుర్కొన్నారు.  అవమానాలు భరించారు.  నగరి నుంచి రెండోసారి వైకాపా తరపున విజయం సాధించారు.  
వైకాపా భారీ విజయం సాధించడంతో.. రోజాకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి.  మంత్రి పదవి కాదు స్పీకర్ పదవి ఇస్తారని కొన్ని రోజులు వార్తలు వచ్చాయి.  లేదు రోజాకు ఎలాంటి పదవి ఇవ్వడం లేదు పార్టీలో ఆమెకు కీలకమైన స్థానం కలిపిస్తారని మరికొన్ని వార్తలు వచ్చాయి.  
వీటన్నింటిని పక్కన పెట్టి ఓ న్యూస్ బయటకు వచ్చింది. రోజాకు మంత్రి పదవి ఖాయం అయ్యిందనే న్యూస్ బయటకు వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన శాఖను రోజాకు కేటాయిస్తున్నారు.  హోమ్ శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.  
అంతేకాదు, మధ్యాహ్నం వరకు రోజాకు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగినా.. ఇప్పుడు ఆ టోటల్ గా అంతా మారిపోయింది.  ఇప్పుడు రోజా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా కాపాడుతుంది.  ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: