జగన్ సీఎం గా ప్రమాణ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఎటువంటి హంగు అర్బాటు లేకుండా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి పట్టుమని పది రోజులు కూడా రాలేదు. అప్పుడే ఎన్నో  సంచలన నిర్ణయాలకు నాంది పలుకుతున్నారు. ఇదే ప్రతి పక్ష పార్టీని కలవరపాటుకు గురి చేస్తుంది. సీఎంగా జగన్ వ్యవహరణ తీరు భేషుగ్గా ఉంది. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తేనే చాలు.


అధికారం అందగానే జగన్ ప్రవర్తిస్తున్న తీరు..  నిండుకుండలా ఉంది. ఏ మాత్రం తొణకకుండా - బెనకకుండా సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి ఇదే తీరును కొనసాగితే మాత్రం చరిత్రలోనే బెస్ట్ సీఎంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.మంత్రి వర్గ ఏర్పాటు  విషయంలో కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు అంటూ.. జగన్ చేసిన ప్రతిపాదన అత్యంత ఆసక్తిదాయకంగా ఉంది. వెనుకబడిన కులాల వారికి అలాంటి అత్యున్నత హోదాలు ఇవ్వడం సమాజంలోనూ ఒక సానుకూల ధోరణిని చాటుతోంది.


ఏదో తమకు ఓటేస్తారనే కులానికో డిప్యూటీ సీఎం అనకుండా.. కాపు - మైనారిటీ - ఎస్సీ - ఎస్టీ - బీసీ..అంటూ అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నారు  జగన్.ఇలా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. బహుశా దేశంలోనే  ఇలా ఎవరూ  చేసి ఉండరేమో. నిజంగానే ఒక యువకుడికి - దార్శానికత ఉన్న - ఓపికైన నేతకు - మంచి ఆలోచన శక్తి - మంచి కమ్యూనికేషన్ ఉన్న నేతకు పదవి ఇస్తే రాజ్యం కచ్చితంగా బాగుపడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: