ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అధికారం కూడా మారింది. టీడీపీ హయాంలో పనిచేసిన వారు మాజీలు కాగా ఇపుడు కొత్తవారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో విశాఖలో రాజకీయ సీన్ ఏంటి అన్నది చూస్తే ఆ శ్రీను పోయి ఈ శ్రీను వచ్చె అంటున్నారు.


గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లాలో టీడీపీ మంత్రిగా ఉన్నారు. ఆయన అటు కాంగ్రెస్ హయాం నుంచి కూడా  ఇటు చంద్రబాబు దగ్గర చేరి మొత్తం ఏడేళ్ళు మంత్రిగా  పనిచేశారు. ఆయన వల్ల రాజకీయాలకు పరిచయం అయిన అవంతి శ్రీనివాస్ టీడీపీలోనే ఎమ్మెల్యే, ఎంపీ చేశారు. ఇపుడు మంత్రి కాబోతున్నారు.


గతసారి క్యాబినెట్లో గంటా భీమిలీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ఇపుడు చూసుకుంటే అదే భీమిలీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన అవంతి శ్రీనివాస్ మంత్రి కాబోతున్నారు. ఆ విధంగా పొలిటికల్ సీన్ మారింది కానీ మంత్రి శ్రీను మాత్రం మారలేదని అంటున్నారు జనం.



మరింత సమాచారం తెలుసుకోండి: