మంత్రి వర్గంలో సామాజిక న్యాయం...!
 ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ కూర్పు పూర్తయింది.
మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం స్వయంగా గవర్నర్‌ నరసింహన్‌ను అందజేశారు. అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించారు. బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు.

 రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్‌ దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు. మంత్రులుగా అవకాశం దక్కినవారికి ఫోన్లు చేస్తున్నారు.

 ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం ఇవ్వగా వీరిలో మాదిగ వర్గానికి 2, మాల వర్గానికి 3 కేటాయించారు. సామాజిక సమీకరణాలను ద ష్టిలో ఉంచుకొని గత కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేసిన జగన్‌ ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చారు. 

ఏపీ మంత్రివర్గ కూర్పు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 25 మందికి జగన్‌ తన జట్టులో చోటు కల్పించారు. అందులో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. వీరంతా శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ జట్టులో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజాకు చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


25 మందితో కూడిన జాబితాను రూపొందించి గవర్నర్‌కు అందజేశారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న25 మంది జాబితాను కాసేపట్లో విడుదల చేయబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: