ఏపీలో అఖండ విజ‌యం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కీల‌క‌మైన త‌న మంత్రివ‌ర్గ ఎంపిక పూర్తి చేసిన సంగతి తెలిసిందే.151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించిన వైసీపీ 25 మంది మంత్రులతో తాజాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఆచితూచి మంత్రుల పేర్లను ఖరారు చేశారు. శ‌నివారం ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


25 మందితో కొలువుదీరిన జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు ఈ డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. మ‌రోవైపు మంత్రులుగా అనుభ‌వ‌జ్ఞులు మ‌రియు యువ‌కులు స‌మ‌పాళ్ల‌లో ఉండేలా జ‌గ‌న్ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇక ఏడుగురు బీసీలకు, ఐదుగురు ఎస్సీలు, నలుగురు కాపు, నలుగురు రెడ్డి, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. జ‌గ‌న్ కేబినెట్‌కు సంబంధించిన అధికారిక జాబితా ఇదే.


మరింత సమాచారం తెలుసుకోండి: