సీ ఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసి వారం రోజులైంది .ఈ వారం రోజుల్లో జగన్ పరిపాలనపై, పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ సీ ఎం ఐనా ఆరు నెలల్లో చేసే పనిని జగన్ గారు వారం రోజుల్లోనే పూర్తి చేసారు. అతి తక్కువ సమయంలోనే ఎంతో ముందుచూపు కలిగిన నాయకునిగా పేరు తెచ్చుకుంటున్నారు.


నవరత్నాల్లో ఇచ్చిన హామీల అమలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు. వృధ్ధాప్య ఫించన్ 250 రుపాయలకు పెంచడమే కాక ఫించన్ వయసును 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకు తగ్గించాడు. సీ ఎంగా భాద్యత స్వీకరించిన ఆరు నెలల్లోనే 5 లక్షల అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాడు.  


రైతు భరోసా పథకం అక్టోబర్ 15 నుండి మొదలు కాబోతుంది. మూడూ వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబోతున్నాడు . ఈ పథకాల అమలుతో ప్రజలకు మరోసారి రాజన్న రాజ్యం చూస్తున్నట్లు అనిపిస్తుంది. రావాలి జగన్ కావలి జగన్ అన్న ప్రజలు ఇప్పుడు వచ్చాడు జగన్ నీ పరిపాలను మెచ్చాము జగన్ అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: