ఏపీలో జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ టీడీపీలు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర మించారు. ఈ క్ర‌మంలోనే పార్టీని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ప‌గ్గాల విష‌యం లో చంద్ర‌బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీకి యువ నాయ‌కుడు జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రో బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న జ‌న‌సేనకు కూడా యువ నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వం వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌యో వృద్ధుడు అయిన చంద్ర‌బాబు పార్టీ ప‌గ్గాల‌ను యువ‌త‌కు అప్ప‌గించాల్సిన అత్య‌వ స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. 


ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాలి? అనే చ‌ర్చ అంత‌ర్గ‌తంగా సాగుతున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి ఉంటే.. చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేసుకుని., రాబోయే రెండే ళ్ల త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని అనుకున్న మాట వాస్త‌వం. అయితే, తాను తొలిసారి పోటీ చేసిన ఎన్నిక‌ల్లోను, అం దునా రాజ‌ధానిని అభివృద్ధి చేసుకున్నామ‌ని చెప్పిన నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరిలోనూ లోకేష్ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోవ‌డంతో ఇప్పుడు నేరుగా పార్టీ ప‌గ్గాలు లోకేష్‌కు అప్ప‌గిస్తే.. కేడ‌ర్ ఎలా జీర్ణించుకుంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి. పైగా లోకేష్ కు మాట్లాడ‌డం రాద‌నే వ్యాఖ్య‌లు ప్ర‌జ‌లు స్థిర‌ప‌డ్డాయి. దీంతో ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావిస్తున్నారు. 


ఇటీవ‌ల జ‌రిగిన సీనియ‌ర్ల అంత‌ర్గ‌త స‌మావేశంలోనే పార్టీ ప‌గ్గాల‌పై చ‌ర్చ జ‌రిగింది. లోకేష్ పేరును ప్ర‌స్తావించ‌కుండానే కొంద‌రు నాయ‌కులు ఆయ‌న వ‌ద్ద‌నే సంకేతాలు ఇచ్చారు. ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబునే నాయ‌క‌త్వంలో కొన‌సాగాల‌ని,  రెండేళ్ల త‌ర్వాత మార్పులు చేర్చుల దిశ‌గా ఆలోచ‌న‌లు చేద్దామ‌ని నాయ‌కులు సూచించారు. దీనికి చంద్ర‌బాబు కూడా త‌లాడించార‌ని స‌మాచారం. అయితే, ఆ త‌ర్వాత అయినా.. కీల‌క నేత అవ‌స‌రం. అలాగ‌ని వేరేవారికి అప్ప‌గిస్తే.. పార్టీ చేతులు మారితే.. ప‌రిస్థితి ఏంటి? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: