ఒక ఉద్యోగానికి కనీసం అర్హత డిగ్రీ ఉండాలి.  డిగ్రీ లేకుంటే ఉద్యోగానికి అర్హత లేదు.  ఎంత టాలెంట్ ఉన్నా.. డిగ్రీ తప్పని సరి.  అందుకే యువత కనీసం డిగ్రీ చదవాలని కష్టపడుతుంది.  చదివిన తరువాత ఉద్యోగం వస్తుందా అంటే ఖచ్చింతంగా వస్తుంది అని చెప్పలేం.  


ఉద్యోగానికి అర్హత ఉందిగానీ, రాజకీయాలకు అర్హత లేదు.  చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావొచ్చు.  చదువు లేని వ్యక్తులు రావొచ్చు.  ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు.  రాజకీయాల్లోకి రావడమే కాదు.. అప్పట్లో బీహార్ ముఖ్యమంత్రి రబ్రీ దేవిలా పరిపాలన కూడా చెయ్యొచ్చు.  


అది బీహార్ కాబట్టి సరే.  ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి.  జగన్ ముఖ్యమంత్రి హోదాలో తన క్యాబినెట్ ను ప్రకటించారు.  జగన్ కు విధేయులుగా ఉన్న చాలా మందికి మంత్రి పదవులు దక్కాయి. వీరిలో కొంతమంది ఇంజీనీరింగ్ చేస్తే..  మరికొంతమంది డిగ్రీ చేశారు.  


కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం లు పదోతరగతి మాత్రమే చదవడం విశేషం.  ఎమ్మెల్యేలుగా రాజకీయాల్లో అనుభవం ఉన్నది కాబట్టి వాళ్ళను మంత్రులుగా తీసుకున్నారు.  బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ లు కాస్త మెరుగ్గా ఇంటర్ చదివారు.  రాజకీయాలకు కనీస అర్హత లేదు కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో రాణిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: