- ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేదుందా లేదా ?
ప్రస్తుత భారత ప్రధాని 2014 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. స్విస్ బ్యాంకు లో మూలుగుతున్న రూ. 90 లక్షల కోట్ల  నల్లడబ్బును వెలికి తెచ్చి ప్రతి బ్యాంకు ఖాతాదారుని ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తామని నమ్మబలికిన మోడీ ఇప్పటికీ ఆ రెండు హామీలు నెరవేర్చలేదు. పెడుతారంటే ఆశ ... కొడతారంటే భయం చందంగా 2014లో నరేంద్ర మోడీకి, అంతిమంగా భారతీయ జనతా పార్టీ కి మెజారిటీ చేకూర్చి గెలిపించారు. అనంతరం 2019 ఎన్నికలు పూర్తవడం మరో సరి గెలుపొందడం జరిగిపోయింది కానీ స్విస్ బ్యాంకు లో నల్ల ధనం, రూ. 15 లక్షల బ్యాంకు డిపాజిట్ హామీలను బి జె పీ గాల్లో కలిపేసింది. 


2014 లో ప్రతిపక్షములో ఉండగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చినప్పుడు, అన్యాయానికి గురైన ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇచ్చితీరాలి అని నొక్కి చెప్పిన నరేంద్ర మోడీ అయన  గెలుపొందిన అనంతరం ఆ మాటను అటకెక్కించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న బి జె పి నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు సరిపోదు , 15 ఏళ్ళు ఉండాలి అని నొక్కి వక్కాణించారు. అనంతరం స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు బి జె పీ సిద్ధంగా లేదని తేల్చారు.


ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో పాటు భారతీయులు కూడా నరేంద్ర మోడీ, అయన పార్టీ బి జె పీ నాయకత్వంలో ఎర్రి పుష్పలై పోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 లో గెలుపొందిన నరేంద్ర మోడీ హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. వచ్చే నాలుగేళ్లలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు. అధికారంలోనికి వచ్చిన అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచారు. పెద్దనోట్లను రద్దు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. జి ఎస్ టి పేరుతో సామాన్యుల నుంచి భారీగా స్టేట్ అండ్ సెంట్రల్ టాక్స్ ను వసూలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. 


దేశ ప్రజలను అంతగా భాదించినా 2019 సాధారణ ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ ఏ విదంగా గెలుపొందారనేది మీమాంసగా రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలచి వేస్తోంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా 2017 సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన సునీల్ అరోరా బి జె పీ అనుకూల వర్గ వ్యక్తి కావడంతోనే ఆ పార్టీ గెలుపు సులభమయ్యిందనే సందేహాలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: