వినటానికే ఆశ్యర్యంగా ఉన్నా ఇదే నిజమని పార్టీ వర్గాలు చెప్పాయి.  జగన్ ఇచ్చిన ఆఫర్ ను రోజా తిరస్కరించటంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.  మంత్రివర్గ కూర్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కసరత్తు చేసిన విషయం తెలిసిందే. తర్వాత అనేక రకాల సమీకరణల తర్వాత మంత్రివర్గాన్ని నిర్ణయించుకున్నారు. అందులో ఫైర్ బ్రాండ్ రోజాకు అవకాశం దక్కలేదు.

 

అయితే ఇక్కడే అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ మంత్రివర్గంలో రోజాకు చోటు లేదని తెలిసిన తర్వాత చాలామంది నమ్మలేకపోయారు. ఎందుకంటే రోజా కూడా తను మంత్రివర్గంలో 100 శాతం ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. అయితే అనుకున్నదొకటి జరిగిందొకటిగా అయిపోయింది.

 

సీన్ కట్ చేస్తే మంత్రివర్గం కూర్పును  ఫైనల్ చేసిన తర్వాత రోజాను జగన్ పిలిపించి మాట్లాడారట. మంత్రివర్గంలో చోటు కల్పించలేపోతున్న విషయాన్ని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం ఇవ్వబోతున్నట్లు చెప్పారట. వైసిపి తరపున మొదటి మహిళా స్పీకర్ అవకాశం తీసుకోమని ఆఫర్ చేశారట. అయితే జగన్ ఆఫర్ ను రోజా తిరస్కరించారు.

 

తాను జనాల్లో ఉండటానికే ఇష్టపడతానని, స్పీకర్ అయితే ఆ అవకాశం ఉండదు కాబట్టి తనకు మంత్రి పదవే కావాలని స్పష్టంగా చెప్పారట. స్పీకర్ ఆఫర్ ను తిరస్కరించిన కారణంగానే రోజాకు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయినట్లు సమాచారం. అయితే రోజా సేవలను జగన్ వదులుకోదలచుకోలేదు. అందుకనే తొందరలో ఏదో ఓ రూపంలో రోజాకు మంచి పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించారట. మరి అదేమిటో తొందరలోనే తెలుస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: