ఒక రాష్ట్రం ముందుకు సాగాలంటే పాలనా పరమైనా మంత్రాంగంతో పాటు..యంత్రాంగం కూడా ఉండాలి.  రాష్ట్రాభివృద్దిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది గమనించిన ఏపి కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించారు.

అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.  కాంట్రాక్టు ఉద్యోగుల అనుభవాన్ని బట్టి రెగ్యులరైజ్ చేయడం..ఔట్ సోర్సింగ్ వారికి జీతాల పెంపు..ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్.  ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అంటే నేను ఒకటే కాదు మీరంతా కూడా అందరూ జాగ్రత్తగా పని చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. 

జగన్ తీసుకున్న నిర్ణయాయినికి అక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో సంతోషించారు.  కాగా, ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో పాటు చాలామంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: