మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత వచ్చిన పవన్ కళ్యాన్ అన్నయ్య చూపిన బాటలో నటుడిగా తన సత్తా చాటాడు..అలాగే రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాడు.  గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’పార్టీ స్థాపించినప్పటికీ పోటీ మాత్రం చేయలేదు.  ఈ నాలుగేళ్ళలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇక ఏపిలో జరిగిన లోక్ సభ, రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి పోటీ చేశారు.  ఒకటి కాదు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాన్ దారుణమైన ఫలితాన్ని చవిచూశారు.  

తాజాగా ఏపీ ఎన్నికల్లో ఓటమిపై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  తాను ప్రచారం చేసే సమయంలో ఉప్పెనలా కనిపించిన జనం తీరా ఎన్నికల్లో ఇలాంటి షాక్ ఇవ్వడం ఏంటీ అన్న విషయంపై పోస్ట్ మార్టం చేస్తున్నారు. 

ఎక్కడ ఈ పొరపాటు జరిగింది..భవిష్యత్ లో ఎలాంటి వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపించాలన్న విషయాలపై జనసేన అభ్యర్థులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా నేతలతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..మొన్న జరిగిన ఎన్నికలు సరైన పద్దతిలో జరగలేదని..పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని చెప్పారు.

అంతే కాదు గెలుపొందిన అభ్యర్థులు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని..కానీ జనసేన మాత్రం అలా ఖర్చుచేయలేదని..అయినా కూడా ప్రజలు తమపై నమ్మకముంచి లక్షల్లో ఓట్లు వేశారని అన్నారు. అయితే జనసేన నాలుగేళ్ల క్రితం పోటీ చేసినట్లయితే ఇంకా బలం పెరిగేదని అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: