సాధారణంగా రాజకీయాల్లో మాట ఇస్తే..చాలామంది ఆ మాట నెరవేర్చుకోవడం విఫలం అవడం చూస్తూనే ఉన్నాం.  కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఓ యువ నాయకుడు వచ్చాడు..సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే తన మాట నిలబెట్టుకోవడం మొదలు పెట్టారు.. ఆ నాయకుడే..సీఎం జగన్ మోహన్ రెడ్డి.  ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చే ప్రయత్నం అప్పుడే మొదలు పెట్టారు.  ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ సర్కార్  రంగం సిద్దం చేసింది.

ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని జగన్  అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు జరిపింది. రాష్ట్ర రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారని కార్మిక సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు.

తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని వారు పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఈనెల 13న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రక్రియ గురించి చర్చ రాకపోవచ్చు.  రెండో కేబినెట్ సమావేశంలో  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది.ఆర్టీసీ జేఎసీ ప్రతినిధులు ఇదే విషయమై సీఎం వైఎస్ జగన్‌ను కలిసి చర్చించే అవకాశం ఉందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: