స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనే సాంగ్ ఉంది కదా.. ఇప్పుడు తెలంగాణాలో ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది.  ఎవరో అలాంటి స్నేహితులు అనే డౌట్ రావొచ్చు. ఇంకెవరు .. తెరాస.. ఎంఐఎం పార్టీలు.  2014 నుంచి ఈ రెండు పార్టీల మధ్య మంచి అనుబంధం ఉంది.  పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ  నియోజక వర్గాల్లో తెరాస స్ట్రాంగ్ అభ్యర్థులను నిలబెట్టదు.  


ఆ విషయం అందరికి తెలిసిందే.  ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ ఏడు ఎంఐఎం పార్టీవే. అక్కడ హిందూ ఓట్ బ్యాంకింగ్ ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. ఇక 2019 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 7  స్థానాల్లో గెలిచింది.  కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలిచింది.  అయితే కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు తెరాస లోకి జంప్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. 


దీంతో 7 స్థానాలున్న ఎంఐఎం కు ప్రతిపక్ష హోదా దక్కడం విశేషం. తెరాస కు మజ్లీస్ మిత్రుడే కాబట్టి ప్రవేశపెట్టబోయే బిల్లులకు అడ్డంకి ఉండదు.  తెరాస చెప్పిందే అక్కడ జరుగుతుంది.  చేసిందే చెల్లుతుంది.  ఎలాగో పాతబస్తీ విషయంలో తెరాస ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుంది.  ప్రాబ్లమ్ లేదు.  


ఇలా ప్రతి పక్షం కూడా మిత్ర పక్షమే అయితే అధికారంలో ఉన్న పార్టీకి పండగే పండగ కదా.  కాంగ్రెస్ పార్టీ నుంచి వాయిస్  వినిపించే వ్యక్తులు లేరు.  అలాగే, బీజేపీ నుంచి ఒక్కరే గెలిచారు.  రాజా సింగ్ మాటను అసెంబ్లీ ఎవరు పట్టించుకోలేరు.  సో, ఇప్పుడు బీజేపీ చేయవలసింది ఒకటుంది.  అదేమంటే.. అధికారంలో ఉన్న తెరాస పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలను గుర్తించి.. తమవైపు తిప్పుకొని పార్టీలో చేర్చుకొని ప్రతిపక్ష హోదా సంపాదిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ కూడా చెక్ పెట్టొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: