రాజకీయాల్లో అవంతి శ్రీనివాసరావు రేర్ ఫీట్ రికార్డ్ చేశారు. అటు శిష్యున్ని, ఇటు గురువుని కూడా ఒకేసారి మించేసి సరికొత్త టాస్క్ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. ఇంతకీ ఏమా కధ.. అవంతి విజయగాధ అంటే చాలానే ఉంది మరి. 


అవంతి శ్రీనివాసరావుని రాజకీయాల్లో తెచ్చిన గురువు గంటా శ్రీనివాసరావు. ఆయన మంత్రి కావడానికి అక్షరాలా పుష్కర కాలం అంటే 12 ఏళ్ళ పాటు వెయిట్ చేయాల్సివచ్చింది. అదే అవంతి గురువు బాటలోనే పార్టీలు మారుస్తూ పట్టు పది మని పదేళ్ళు తిరక్కుండానే మంత్రి సీట్లో హ్యాపీగా కూర్చుంటున్నారు. మరో వైపు గంటా మాజీ మంత్రి అయిపోయారు. అలా గురువుని గెలిచేశారన్నమాట.


ఇక అవంతి శిష్యుడు ఎవరో కాదు అదే వైసీపీలో ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్. ఆయన అవంతి పెట్టిన  కాలేజిలో చదువుకున్నారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ పదవికి ఈ గురుశిష్యులు ఇద్దరు టీడీపీ, వైసీపీ తరఫున పోటీ పడ్డారు. కానీ గురువు అవంతి శిష్యున్ని ఓడించి తొలిసారి గెలిచారు. ఇపుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు.


 ఇద్దరూ ఎమ్మెల్యేలుగా వైసెపీఎ నుంచి గెలిచారు. ఇద్దరూ జగన్ క్యాబినెట్లో మంత్రులు కావాలనుకున్నారు. అయితే ఇపుడు కూడా అవంతి మంత్రిగా చోటు సాధించి శిష్యున్ని గెలిచేశారు. ఎన్నికల ముందు హఠాత్తుగా  పార్టీలోకి వచ్చి కుర్చీ తన్నుకుపోతే ఏళ్ళ తరబడి పార్టీలోనే ఉన్నా కూడా  నోళ్ళెళ్ళబెట్టడం శిష్యుని వంతైందన్నమాట. అదండీ మ్యాటర్


మరింత సమాచారం తెలుసుకోండి: