జగన్ నోటి వెంట ఎపుడూ ప్రత్యర్ధుల మాట రాదు. అవసరమైతేనే ఆయన వారి పేర్లు వల్లిస్తారు. ఆయన ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ చెప్పింది చంద్రబాబు గురించే. మిగిలిన వారిని పేరు పెట్టి కూడా పిలవడానికి జగన్ ఇష్టపడరు. అటువంటిది జగన్ లోకేష్ ని ఈ టైంలో గుర్తు చేస్తారా


బంపర్ మెజారిటీతో నెగ్గిన జగన్ ఇపుడు మాజీ మంత్రి గా ఉన్న లోకేష్ ని ఎందుకు కోరి గుర్తు చేస్తారు. అవును గుర్తు చేశారు. మంత్రివర్గం విస్తరణ సందర్భంగా జగన్  మంగళగిరి నుంచి మంత్రిగా ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిని తీసుకోలేదు. కానీ ఎన్నికల వేళ మాత్రం ఆయన ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటికే మంత్రి హోదాలో ఉన్న లోకేష్ ని జనంలో తగ్గించడానికి అదే మంత్రి పదవి ఆళ్ళకు ఇస్తానని చెప్పి అమాంతం పెంచేశారు.


ఇదంతా బాగానే ఉంది ఇపుడు ఆళ్లకు మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకోసం రెండున్నరేళ్ళు ఆగాల్సివుంటుదని అంటున్నారు. ఓ విధంగా జగన్ మాట తప్పారని కూడా వినవస్తోంది. అదే లోకేష్ ని గెలిపించినా మాకు  అయన కూడా ఆళ్ళ మాదిరే ఎమ్మెల్యేగానే ఉంటారు కదా ఈ మాత్రం దానికి ఆళ్ళను ఎందుకు గెలిపించడం అని మంగళగిరి ప్రజలు ఇపుడు జగన్ని అనుకుంటూ లోకెష్ ని తలచుకుంటే మాత్రం ఆ గొప్పతనం అచ్చంగా జగన్ దే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: