పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు.  విశాఖలోని గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు.  ఈ రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. జనసేన పార్టీ ఓటమిపై విశ్లేషణ జరిగింది.  ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఈ సమావేశంలో మాట్లాడారు.  


ఇక భీమవరంలో పవన్ ఓటమి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  ప్రజాభిమానం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయాం. నా జీవితం రాజకీయాలకు అంకితం. నేను మళ్లీ చెబుతున్నా నా శవాన్ని నలుగురు మోసుకెళ్లే వరకు నేను జనసేనను మోస్తా.  ఓటమి నాకు కొత్త కాదు. దెబ్బతినే కొద్దీ ఎదిగే వ్యక్తిని. 


25 ఏళ్ల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఓటమి ఎదురైతే తట్టుగలనా? లేదా? అనేది నేను పరీక్షించుకున్న తర్వాతే పార్టీ స్థాపించా. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా. బలంగా గెలుస్తా. భీమవరంలో నన్ను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. పవన్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వరాదు.. ఎలాగైనా ఓడించాలని ప్రత్యర్థులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని నేను పట్టించుకోను. ప్రజా తీర్పుని గౌరవిద్దాం అని ఈ సందర్భంగా అన్నారు.  


ఎలాగో ఓడిపోయారు.  రిజల్ట్ అన్నవి ఇప్పుడు తిరిగి రావు.  కాబట్టి జరగాల్సిన కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలి.  పవన్ ముందు స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరో అవకాశం రెడీగా ఉంది.  జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో సత్తా చాటితే మళ్ళీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసంపెరుగుతుంది .  


మరింత సమాచారం తెలుసుకోండి: