వైకాపా మంత్రుల లిస్ట్ లో రోజాకు చోటు దొరక్కపోవడంతో ఆమె అసంతృప్తి తో ఉన్న సంగతి తెలిసిందే.  పైకి జగన్ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటామని అన్నా.. లోపల మాత్రం అసంతృప్తి ఉంటుంది అన్నది తెలిసిన అంశమే.  రోజాకు పదవి ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియదు.  


అయితే, తాజా సమాచారం ప్రకారం, రోజా, అంబటి రాంబాబులకు నామిడేటెడ్ పోస్టులు ఇస్తారని ఇస్తారని సమాచారం.  నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి.  అసంతృప్తి వాదులకు ఇలాంటి పోస్టులు ఇచ్చి బుజ్జగిస్తుంటారు.  అయితే, మంత్రులకు ఉన్న గౌరవం ఈ పోస్టులకు ఉంటాయా అన్నది సందేహం. 


రెండున్నర సంవత్సరాల తరువాత మళ్ళీ మంత్రి పదవులకు కొత్తవాళ్లను ఎంపిక చేస్తారు కాబట్టి అప్పుడు రోజాకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.  కానీ, అప్పటి వరకు ఎవరు ఉంటారో ఎవరు ఊడతారో తెలియదు కదా. ఒకవేళ పదవిలో ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తున్నారని తెలిస్తే ఆ పదవిని మరొకరికి ఇవ్వరు.  


అప్పుడు రోజా, అంబటి వంటి వాళ్ళ పరిస్థితి ఏంటి.  అంటే అప్పుడు ఇస్తే ఏ పోస్ట్ ఇస్తారో తెలియదు.  ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది.  ఇప్పుడు జరిగిన దానికంటే అది చాలా పెద్ద అన్యాయంగా భావించాల్సి వస్తుంది.  దీని నుంచి బయటపడేందుకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: