జగన్ కేబినేట్లో రోజాకు చోటు దక్కలేదు. జగన్ సీ ఎంగా ప్రమాణం చేసిన రోజు నుండే మంత్రిగా రోజాకు చోటు దక్కుతుందని అందరూ భావించారు. మొదట్లో రోజాకు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపించాయి. ఒకవేళ రోజాకు స్పీకర్ పదవి ఇస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకీ చుక్కలే అనే మాటలు వినిపించాయి.


నిన్న జగన్ లిస్ట్ విడుదల చేయకముందు వరకు కూడా రోజా గారి హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. కానీ రోజా గారికి మాత్రం చోటు దక్కలేదు. 151 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలో మంత్రివర్గంలో 25 మందికి మాత్రమే అవకాశం ఉంది.


ఈ 25 మందిలో కూడా అనుభవం ఉన్న నాయకులు, కుల సమీకరణలు, రాజకీయ సమీకరణాలు, ప్రతి జిల్లాకు సమన్యాయం చేయటం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏర్పడిన కేబినేట్ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది.తర్వాత మరలా కొత్త కేబినేట్ మొదలవుతుంది. ఈ సారి స్థానం దక్కకపోయినా జగన్ వచ్కెహి కేబినేట్లో రోజాకు మంత్రి పదవి ఇవ్వటం మాత్రం ఖాయం


మరింత సమాచారం తెలుసుకోండి: