జగన్ తన మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చి సామాజిక న్యాయం చేశారు. దీనితో అందరూ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే మంత్రివర్గంలో కనీసం ఏడెనిమిది మంది రెడ్డి సామాజిక వర్గ జనాలు వుంటారని అందరూ ఊహాగానాలు చేసారు. ఎందుకుంటే వైకాపాకు వున్న 151 మంది ఎమ్మెల్యేల్లో యాభైకి పైగా రెడ్లు వున్నారు. కానీ వాళ్లకు షాక్ ఇచ్చేలా కేవలం నలుగురికి మాత్రం మంత్రి పదవులు ఇచ్చాడు. ఎస్సీలకు రెడ్లకన్నా ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు.


తెలుగుదేశం తమది బిసిల పార్టీ అని చెప్పుకుంటుంది. కానీ జగన్ బిసిలకు పెద్ద పీట వేసారు. అదే విధంగా కాపులకు సముచిత స్థానం ఇచ్చారు. సామాజిక సమతూకం పక్కాగా వుండేలా చూసుకున్నారు. వైశ్యులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు కూడా అవకాశం కల్పించారు. మొత్తంమీద ఈ విషయాల్లో తనను విమర్శించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చేయడం అన్నది జగన్ ఆలోచనగా క్లియర్ గా కనిపిస్తోంది.


అదే సమయంలో అధికారులకు అధికారాలు ఇచ్చి, వారి చేత పాలన సాగించాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, మంత్రి పదవులు నామమాత్రమే అని, జగన్ తో అధికారుల ద్వారా సాగేపాలనే భవిష్యత్ లో వుంటుందని తెలుస్తోంది. మొత్తంమీద జగన్ బాగానే జాగ్రత్త పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, దాని మూల సామాజిక వర్గ జనాల సంగతి బాగానే అర్థమైపోయినట్లుంది జగన్ కు. కానీ ఒక్కటే సమస్య వుంది. ఫుల్ పాజిటివ్ ఫోర్స్ వున్నంతకాలం ఇలాంటి వ్యవహారాలు బాగానే వుంటాయి. చాపకింద నీరు వ్యవహారాలు వుండనే వుంటాయి. వాటి విషయంలో జగన్ జాగ్రత్తగా వుండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: