2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు చంద్రబాబు . కానీ 2019 ఎన్నికల్లో మాత్రం కేవలం 23 సీట్లతో ఘోర పరాభవం పొందాడు. ఐదేళ్ళ చంద్రబాబు పరిపాలన పట్ల ప్రజలు వ్యతిరేఖ తీర్పును ఇచ్చారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబును కూడా గెలిపించుకోలేకపోయాడు

 

తెలుగు దేశం పార్టీ ఇంత ఘోర పరాజయం పొందటానికి ముఖ్య కారణం జన్మభూమి కమిటీలు. ఈ కమిటీలు చేసిన అరాచకాల వల్లే చంద్రబాబు నాయుడు పై ఇంత వ్యతిరేఖత మొదలైంది. చంద్రబాబు మంచి ఆలోచనలతోనే పథకాలు ప్రారంభించినా ఈ కమిటీలు ఆ పథకాలను అర్హులకు అందకుండా చేసాయి.

 

తమ పార్టీ వాళ్ళలు టీడీపీ సానుభూతిపరులలకు మాత్రమే పథకాలు వర్తింపజేయటంతో తటస్థుల్లో సామాన్య ప్రజల్లో తీవ్రమైన అసహనం నెలకొంది. అర్హులైనా పథకాల అమలు సరిగ్గా జరగకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జన్మభూమి కమిటీల్లో అక్రమాలకు చోటు ఇవ్వకుంటే తెలుగు దేశం మెరుగైన ఫలితాలే సాధించి ఉండేది.


మరింత సమాచారం తెలుసుకోండి: