ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీకి ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. ముఖ్య‌నేత‌లు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేయ‌గా..తాజాగా ఇంకో ముఖ్య‌నేత పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నిర్ణ‌యం తీసుకొని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.


రెండు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వ్యవహరించారు. గ‌త ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీలో మ‌నోహ‌ర్ చేరారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టిన సమయంలోను ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, తిరిగి పుంజుకుంటున్న సమయంలో ఆయ‌న జ‌న‌సేన వెళ్ల‌డంపై చ‌ర్చ జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లోనూ తిరిగి తెనాలి నుంచి జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. 2019పై కాంగ్రెస్ మళ్లీ ఆశలు పెట్టుకుంటున్న సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీని వీడటంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. 


మంచి వక్తగా పేరున్న నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు జ‌న‌సేనలో స్వ‌ల్ప‌కాలంలో ప‌వ‌న్ పెద్ద‌పీట వేశారు. పవన్ కళ్యాణ్‌ విస్తృతంగా పర్యటనలు, ప్రచారంలో నిమగ్నమ‌గా ఆయ‌న‌తో పాటు మ‌నోహ‌ర్ సైతం ప‌ర్య‌టించారు. అలాంటి ముఖ్య‌ నేత జ‌న‌సేన‌కు గుడ్‌బై చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఘోర ప‌రాజ‌యం పాల‌యిన జ‌న‌సేన‌లో వివిధ నేత‌లు పార్టీని వీడుతుండ‌గా...ఇప్పుడు మరో కీలక నేత వీడటం జ‌న‌సేన‌ పార్టీకి మింగుడు పడటం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: