వైఎస్ జగన్ మంత్రి వర్గంవిస్తరణ సమయంలో సమతూపం పాటించాడని అందరు అనుకుంటున్నారు.  అన్ని వర్గాల వారికి సమానమైన న్యాయం చేకూర్చారు.  దీంతో కొంతమంది తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.  అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటకు వెళ్లే పరిస్థితి లేదు.  


ప్రతిపక్షంలో టిడిపి ఉన్నది.  ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.  దీంతో పార్టీలోనే ఉండాలి.  పార్టీని నమ్ముకున్న చాలామందికి పదవులు రాలేదు.  వీరంతా పదవి లేకుండా పార్టీలో ఉండలేరు.  అలాగని బయటకు పోలేరు. వైకాపా అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు వస్తాయని అనుకున్నా.. అందరికి సమానంగా పదవులను కట్టబెట్టి సమతూకం పాటించారు.  


మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రాదేశిక ఎన్నికలు జరగబోతున్నాయి.  సంస్థాగతంగా బలపడాలన్నా, ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సాధించాలన్నా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పుడు.  అందుకే కష్టమైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.  


దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలంటే సమతూకం పాటించాలి.  తెలుగుదేశం పార్టీకి పట్టున ఉభయగోదావరి జిల్లాలో పాగా వేయాలంటే ఇలాంటి నిర్ణయం తప్పనిసరి.  అందుకే జగన్ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: