ఆంధ్రజ్యోతి జగన్ కు ఎంతలా వ్యతిరేకంగా పని చేసిందో మనకందరికీ తెలుసు. తనను అదే పనిగా పచ్చ మీడియాగా అభివర్ణించే ప్రత్యర్థులను ఉద్దేశించి ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ పాజిటివ్ గా రియాక్ట్ కావటం సాధ్యమేనా? అంటే నో అని చెప్పేస్తారు. బాబును భుజాల మీద ఎక్కించుకొని మోసిన ఆర్కే లాంటోళ్లు.. జగన్ ను.. ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రతిసారి ఎంతలా నిందించారో.. మరెంతలా ఆరోపణలు గుప్పించారో తెలిసిందే.


అలాంటి వారు.. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పది రోజుల పని తీరు మీద ఎలా రియాక్ట్ అయ్యారన్నది ఆసక్తికరం. సైద్ధాంతిక విభేదాలు ఉన్న వారు ప్రతి విషయంలోనూ లోపాలే వెతుకుతారు. కానీ.. అందుకు భిన్నంగా తాజాగా తాను రాసే వీకెండ్ కామెంట్ లో ఆర్కే రాసిన వ్యాసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. తన తాజా వీకెండ్ కామెంట్లో జగన్ పాలనపై ఆర్కే చేసిన పాజిటివ్ కామెంట్స్ ను చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధికారుల నియామకాలు ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వేసిన అడుగులు ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి.


 తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును గమనించిన వారికి ఆయన ముఖ్యమంత్రి అయితే..? అన్న భయాలు ఉండేవి. కానీ తన గతాన్ని ప్రజలు మర్చిపోయేలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో అవినీతి నిర్మూలనకు పారదర్శకతకు పెద్దపీట వేస్తామని పదే పదే చెబుతున్న ఆయన అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి. దీంతో ఇప్పటి వరకు జగన్ను వ్యతిరేకించిన వర్గాలన్నీ ఇకపై ఆయన వేయబోయే అడుగులు వ్యవహరించబోయే తీరు పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనా అని సందేహపడుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏమేమి తప్పులు చేశారో గమనించిన జగన్మోహన్ రెడ్డి తాను ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో తన నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేరన్న సంకేతాలను కూడా స్పష్టంగా పంపిస్తున్నారు.  అని జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం గమనార్హం ..!

మరింత సమాచారం తెలుసుకోండి: