ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.  2018 లో మరోసారి ప్రజలు కెసిఆర్ ను గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ కు అభినందలు తెలిపేందుకు ఆరోజున కెసిఆర్ విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే.  


విజయవాడలో కెసిఆర్ జగన్ గురించి మాట్లాడుతూ.. వయసు చిన్నదే భాద్యత పెద్దది అన్నారు.  వయసు చిన్నదే అయినా.. జగన్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా స్పీడ్ గా ఉన్నారు.  ఎక్కడ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దూసుకుపోతున్నారు.  


ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాడు.  అలాగే హామీలను ఒక ఫ్రెమ్ లా కట్టించి సిఎం ఛాంబర్ లో పెట్టించారు.  ఏ పథకాల్ని ఎలా అమలు చేయాలో దశలవారీగా నిర్ణయించుకుంటున్నారు.  అంతేకాదు, సంక్షేమ పధకాలను అమలు చేయడంలో జగన్ తనదైన ముద్రను వేసుకున్నారు. 


ఇది కెసిఆర్ కు బాగా నచ్చింది. జగన్ వయసు చిన్నదై అయినా పథకాలకు అమలు చేయడంలో అందరికంటే ముందుగా ఉన్నాడని కీర్తించాడు.  ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  నెటిజన్లు కెసిఆర్ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: