ఎలాగైనా మోడీని ఎదుర్కొని కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకున్న ప్రతిపక్షాలకు అవకాశం దొరకలేదు.  మరోసారి మోడీకి ప్రజలు పట్టంగట్టారు.  మరో కొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుంది.  


స్పీకర్ పదవిని బీజేపీ తీసుకొని, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని అనుకుంది.  పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా గుర్తింపు పొందిన డీఎంకేకు ఆ అవకాశం ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.  అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని శివసేన ఆశించింది. దీనిపై మోడీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


డీఎంకేకు డిప్యూటీ పదవి రావడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది.  అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి డీఎంకే కు ఇస్తే.. ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి  ఓ ఫెవర్ చేయాలనీ,  మాజీ ప్రధానిని రాజ్యసభ ఎంపీగా తమిళనాడు నుంచి ఎంపిక చేయాలని కోరిందట. 


అందుకే స్టాలిన్ ఒకే చేసినట్టు సమాచారం.  డీఎంకే చెందిన కనిమొళికి డెప్యూటీ స్పీకర్ గా పదవిఇస్తున్నారు. ఇలా ఆమెకు పదవి ఇవ్వడం వెనుక ఓ ప్లాన్ ఉన్నట్టుగా అర్ధం అవుతున్నది.  డీఎంకేతో సాన్నిహిత్యం పెట్టుకుంటే భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి తమిళనాడులో పనిచేయొచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ పని చేసి ఉండొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: