అపజయం కలిగినప్పుడే ఎవరు తన వాళ్ళు, ఎవరు అవకాశ వాదులు అనే విషయం స్పష్టం అవుతుంది అంటారు,  జనసేన అధినేతకి ఇప్పుడిప్పుడే ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తోంది. ఎన్నికలు అయ్యి అవ్వగానే జనసేనలో పవన్ కోసం, ప్రజా సేవ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, లేక పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఎవరో అనేది స్పష్టం అవుతోంది. రావెల కిషోర్  బాబు తాజాగా రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన రావెల ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో జనసేనలోకి జంప్ చేశారు. దాంతో  పవన్ కళ్యాణ్ రావెల కి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికారు కూడా, అయితే.

 Related image

జనసేన ఘోరమైన వైఫ్యల్యం తో మళ్ళీ రావెల మనసు మార్చుకున్నారు. జనసేన పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని, ఇప్పట్లో జనసేన కి అధికారం కాదు కదా, కనీసం కింగ్ మేకర్ కూడా అయ్యే అవకాసం లేదని  భావించిన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లుగా లేఖ ద్వారా తెలియచేసిన విషయం విదితమే. అయితే రావెల రాజీనామా లేఖ చూసింది మొదలు జనసేనలో మరో కీలక నేతకి టెన్షన్ పట్టుకుందట. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆ నేత. విభజన అనంతరం సైలెంట్ పాలిటిక్స్ కి పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచీ పోటీ చేయాలని అనుకున్నా, జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం అవుతుందని, తన రాజకీయ భవిష్యత్తు కి రాచబాట పవన్ వేస్తారని ఊహించి, జనసేనలో చేరి పవన్ కి కీలకమైన సన్నిహితుడిగా చోటు దక్కించుకున్నారు.

 Image result for pavan kalyan

కట్ చేస్తే... ఈ దఫా ఎన్నికల్లో ఘోరమైన ఓటమి జనసేన చవి చూడటంతో ఆయన ఊహలన్నీ పటాపంచలు అయ్యాయి. దాంతో సదరు నేత రావెల ఎస్కేప్ చూసి, తెగ టెన్షన్ పడుతున్నారట. ఎలాగైనా సరే జనసేన నుంచీ బయటకి వెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలో రావెల బాటలో నడవబోయేది, జనసేనలో మూడో వికెట్ గా  పడబోయేది సదరు నేతదే అంటున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే జగన్ తన ఎంట్రీ కి పచ్చ జెండా ఊపుతారో లేదోనని ఆలోచనలో ఉన్న ఆయన బీజేపీ వైపు ఆశగా చూస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: