జగన్ ఏపీ సీఎం గా రోజురోజుకు పాలనలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. కానీ మాజీ సీఎం చంద్రబాబు మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదు. అసలు తన అస్తిత్వాన్ని నిరూపించుకోడానికైనా అనుకూల మీడియాలో ఏదో ఒకటి అచ్చువేయించుకుంటారు చంద్రబాబు. కానీ ఇప్పుడు అలా కూడా ముచ్చటించలేని దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రోజురోజుకీ పాలనలో జగన్ తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తూ, విమర్శలకు తావులేకుండా చేస్తుంటే.. చంద్రబాబుకి కడుపు రగిలిపోతోంది.


ఎక్కడ ఎలా అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న బాబుకి సీఎం జగన్ వ్యవహారం ఓ పట్టాన మింగుడు పడటంలేదు. రోజు రోజుకీ ఆయన ఆలోచనా ధోరణి బాబుకి అంతుచిక్కడంలేదు. ఫలితాలొచ్చిన ఇన్నాళ్లకు కూడా సీఎం జగన్ పై నిర్మాణాత్మకంగా ఒక్క విమర్శకూడా చేయలేని స్థితికి వెళ్లిపోయారు మాజీ సీఎం చంద్రబాబు. అలా అనడం కంటే.. బాబు నోరు అలా జగన్ మూయించేశారు అనడం సమంజసం. మంత్రివర్గ విస్తరణ నుంచి, కీలక నిర్ణయాల వరకు ఎక్కడా బాబుకు అవకాశం ఇవ్వలేదు నూతన ముఖ్యమంత్రి జగన్.


అసలు చంద్రబాబు అడ్రస్ లేకుండా పోవడానికి జగనే ప్రధాన కారణం. ఎన్నికల్లో ఓడించడం ఒక ఎత్తయితే, అధికారం చేపట్టాక.. రోజూ చంద్రబాబుని నైతికంగా ఓడిస్తుండటం మరో ఎత్తు. జగన్ వాలకం గమనిస్తే.. టీడీపీ తిరిగి అధికారం చేపట్టడాన్ని తాను చూడలేనని డిసైడ్ అయ్యారు బాబు. అసలు బాబు జగన్ గురించి ఎప్పుడు నోరు విప్పుతారా, ఏం మాట్లాడతారా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించే విషయం. అందుకేనేమో ఏం అచ్చువేయాలో తెలియక అతడి తోక పత్రికలు కూడా తోకముడుచుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: