ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి అత్యంత   దారుణంగా పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ మరొకటి తగలబోతోంది.  తెలుగుదేశం పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా మెలిగిన దేవేందర్ రెడ్డి పార్టీ మారబోతున్నారు.   ఇది ఎంతవరకు నిజమో తెలియదుగాని, తెలుగుదేశం పార్టీ లో మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతున్నది. 


తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి  చెందిన కొంతమంది నేతలు కూడా పార్టీ మారేందుకు   సిద్ధం అవుతున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం  పెద్దగా లేకపోవడంతో పాటు కాంగ్రెస్ కూడా బలహీనంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  


కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది.  కేంద్రంలోను అదే  పరిస్థితి ఉండటంతో.. పార్టీ నేతల చూపులు బీజేపీవైపు ఉన్నాయి.  బీజేపీ గత ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు గెలుచుకుంది.  వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


ఇందులో భాగంగానే బీజేపీ చోటామోటా నాయకులకు వలలు వేస్తోంది.  ఈ వలలో తెలుగుదేశం తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చిక్కుకోబోతున్నారు.  అయితే, దేవేందర్ రెడ్డి పార్టీ మారబోతున్నట్టు బయటకు సమాచారం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: