పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకొని గతంలో కంటే మెరుగ్గా ఉంది.  కాంగ్రెస్ పార్టీ కొంతమేర లాభపడినా ప్రతిపక్ష హోదాను మాత్రం కోల్పోయింది.  దీంతో ఆ పార్టీకి ఎం చేయాలో పాలుపోవడం లేదు.  బీజేపీ గెలుపును తప్పు పట్టాలని చూస్తోంది.  వీలైనంత వరకు తప్పుపట్టి ఎదో విధంగా మసిపూయాలని చూస్తోంది.  


ఇందులో భాగంగానే ఓ న్యూస్ బయటకు వచ్చింది.  దాన్ని ఎవరు స్పెర్డ్ చేస్తున్నారో తెలియదుగాని ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.  బీజేపీ 303 స్థానాలు గెలుచుకోలేదని.. అందులో 220 స్థానాల్లో ఈవీఎం లు టాంపరింగ్ జరిగాయనే వార్తా సామజిక మాధ్యమాల్లో స్ప్రెడ్ అయ్యింది. 


మరోవైపు వైకాపాపై కూడా ఇదే విధమైన బురద జల్లే ప్రయత్నం జరుగుతున్నది.  వైకాపా 60 స్థానాలు మాత్రమే గెలుచుకునే సత్తా ఉందని, టాంపరింగ్ వలన 151 స్థానాలు గెలుచుకుందని వార్తలు వస్తున్నాయి.  వీటిలో నిజం లేదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది.  


ఈవీయం లను టాంపరింగ్ చేసే అవకాశం లేదని, అది ఎన్నటికీ జరగదని, టాంపరింగ్ అనే మాట అసంభవం అని తేల్చి చెప్పింది. పార్టీలు సైతం అదే విధంగా అంటున్నాయి.  ఓడిపోయిన పార్టీలు ఇలా ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: