రోమ్ వెళ్ళినపుడు రోమన్ లా ఉన్నాడు.  రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిగా ఉండాలి.  ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే విజయం సాధించగలుగుతాము.  ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూశారు.  తన ఓటమికి డబ్బు పనిచేసిందని.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓడించారని పవన్ విమర్శించినా సంగతి తెలిసిందే.  


రాజకీయాల్లో వేసే కొత్త వ్యూహాలు ఎలా ఉంటాయో చూపిస్తా, దెబ్బకు దెబ్బ తీస్తామని, అంతేకాకుండా మన రాజకీయాల్లో మార్పు వచ్చేంత వారు కూడా రాజకీయ ఎత్తుగడలు వేస్తానని, శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగేవరకు కూడా ఈ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తానని పవన్ ఈరోజు వ్యాఖ్యానించారు.  


ఎవరెన్ని అన్నా ఎవరు తిట్టినా ఎవరు పొగిడినా వాటి గురించి పట్టించుబోనని, తనకు ప్రజల సమస్యలే ముఖ్యమని తన చివరి శ్వాసవరకు ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తామని పవన్ చెప్పడం విశేషం.  ఇకపై సినిమాలు చేసే ఆలోచన లేదని ఇప్పటికే పవన్ తేల్చి చెప్పాడు.  


అప్పట్లో జగన్ ఎలాగైతే ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేశారో... ఇప్పుడు జగన్ కూడా అలాగే ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేయబోతున్నారు.  మరి జగన్ లా పవన్ జనహృదయాలను గెలుచుకోగలుగుతాడా.. అన్నది తెలియాలి.  జగన్ జననేతగా ఎదగడానికి చాలా కృషి చేసిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: