టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్‌-మార్క్, కాపీ-రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాష్‌ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా లోపల ఒకలా వ్యవహరిస్తున్నారని బంజారాహిల్స్‌ విచారణకు సహకరించడం లేదని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రవిప్రకాష్‌ను గత మూడు రోజులుగా విచారించినా ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. 
Banjara Hills Police Comments On Ravi Prakash - Sakshi
ఆయనను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అలంద మీడియా ఇచ్చిన కేసుపైన అన్ని కోణాల్లో రవిప్రకాష్‌ను ప్రశ్నించామన్నారు. రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద సాంకేతిక ఆధారాలున్నాయని ఆయన వెల్లడించారు. నిర్దోషినని నిర్ధారించుకునేందుకు తగిన ఆధారాలేమీ రవిప్రకాశ్‌ వద్ద లేవని ఆయన చెప్పారు. ఫోర్జరీ చేసినట్లు వస్తున్న అభియోగాలపై సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులు చెప్పిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. 


సుప్రీంకోర్టు సూచనలను అనుసరించే రవిప్రకాశ్‌ను విచారించామన్నారు. మూడురోజులపాటు విచారించినప్పటికీ పొంతనలేని సమాధానం చెప్పారని, ఈ కేసు విషయం లో సినీనటుడు శివాజీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారని తెలిపారు. శివాజీ హైదరాబాద్‌ వచ్చిన తరువాత ఆయనకు చెబుతామని కుటుంబసభ్యులు తెలిపి నట్లు ఏసీపీ వివరించారు. సోదాల్లో తమకు దొరికిన ఆధారాలు, సాక్షులు చెప్పిన విషయాలు, మూడు రోజులపాటు రవిప్రకాశ్‌ విచారణ సారాంశాన్ని సోమవారం న్యాయస్థానా నికి నివేదిస్తామన్నారు. న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ఆయన్ను అరెస్ట్‌ చేయాలా? వద్దా? అనేది తెలుస్తుందని ఏసీపీ స్పష్టం చేశారు.

నటుడు గరుడ పురాణం శివాజీకి కూడా ఈ మధ్యనే నోటీసులు పంపామన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, రవిప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టే రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయాలా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు సైబర్‌ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: