దెబ్బ పడినంటే అబ్బా అనకుండానే నొప్పి తెలియాలి. అదే అసలైన స్ట్రటజీ. అలా చేసినా వాడే అపర చాణక్యుడు. మాకు ఒకటి కొట్టారు కదూ బాగా గుర్తుంచుకుంటాం. ఇంతకు ఇంతా దెబ్బ తీస్తామని నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తరువాత జగన్ అన్న మాటలు నేటికి అక్షర సత్యాలు.  తనదైన రాజనీతితో అంతకు అంతా బదులు తీర్చుకున్నాడు.  మంత్రులు అంటే మన ఇష్టం వచ్చిన వారిని చేయవచ్చు. గోడ దూకితే చాలు మంత్రి పదవి గ్యారంటీ, సొంత కులమైతే మరీ గ్యారంటీ. డబ్బుంటే ఇంకా గ్యారంటీ. జిల్లాను శాసిస్తే ఇంకా గ్యారంటీ ఇలాంటి లెక్కలు పెట్టుకుని కుర్చీలు వేసేవారికి జగన్ ఝలక్ ఇచ్చారు.


మంత్రి వర్గం అంటే ఏంటో చూపించారు. మొత్తం సమాజాన్ని ప్రతిబింబించాలి. అన్ని కులాలు, వర్గాలు కనిపించాలి. అపుడే సామాజిక న్యాయం అన్న మాటకు అర్ధం ఉంటుంది. మాదీ బీసీ పార్టీ అని చెప్పుకునే టీడీపీ జమానాలో 12 మంది కమ్మ మంత్రులు ఉండేవారు. అంటే యాభై శాతాం వాటా అన్నమాట. మరి సమాజంలో అత్యధిక శాతం ఉండే బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలకు చోటు ఏదీ  ఇదే విషయం జగన్ ఆచరణాత్మకంగా చూపించారు. మంత్రి పదవి అంటే పంచుకోవడం కాదు. మనవాడు పరవాడు తేడా లేకుండా అందరికీ సమాన వాటా కల్పించడం అని చేసి చూపించారు.


ఇపుడు బీసీ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ వైసీపీ ని చూసి అదరాలి. బెదరాలి. అభ్యర్ధుల ఎంపిక నుంచే బీసీలకు పెద్ద పీట వేఅసిన జగన్ మంత్రులుగానూ వారినే ముందు వరసలో పెట్టారు. మొత్తం ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారంటే ఇది గొప్ప క్యాబినెట్ కింద లెక్క. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో పోయాక  ఎస్సీ, ఎస్టీ  వర్గాలకు ఇంతలా సమాదరణ లభించలేదన్నది  నిజం.  ఆయా వర్గాలకు జగన్ సర్కార్ లోనే మళ్ళీ న్యాయం జరిగిందని  చెప్పకతప్పదు. ఏకంగా ముగ్గురు ఎస్సీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఎస్టీ నుంచి, ముస్లిం మైనారిటీ నుంచి కూడా మంత్రులను చేసిన జగన్ సమ సమాజ స్థాపన అంటే ఇదేనని చాటి చెప్పారు.




నిజానికి వైసీపీ అధినేత  జగన్ పాదయాత్రతోనే ఏపీలో సామాజిక సమీకరణలు మారడం మొదలైంది. జగన్ బీసీ డిక్లరేషన్ తరువాత పరిస్థితి పూర్తిగా ఆ వైపుగా మళ్ళింది. జగన్ సైతం బీసీలకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చాక ఓట్లు సైతం అటే పెద్ద ఎత్తున పడ్డాయి. ఇపుడు మంత్రులుగా వారిని చేశాక బీసీ రాజకీయం మొత్తం వైసీపీ వైపుగా మారిపోయింది. ఈ సమయంలో బీసీల పార్టీగా చెప్పుకోవడానికి టీడీపీకి ఇబ్బంది తప్పదేమో. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ కార్డు తో జగన్ టీడీపీ కూసాలు కదిలిపోయే మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అక్కున చేర్చుకుని అక్కడ తన పట్టుని స్థిరపరచుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: