పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతి త్వరలోనే సొంత పత్రికను జనసేన పార్టీ కోసం తీసుకురాబోతున్నాడు. నిజానికి పవన్ కల్యాణ్ కు మీడియా సపోర్ట్ లేదు. ప్రతి పార్టీ కు లెక్కలేనన్నీ ఛానెళ్ళు , పత్రికలు ఉన్నప్పటికీ జనసేన పార్టీ తరపున సరైన మీడియా లేదు. 99 టీవీ ఛానెల్ జనసేన కోసం పని చేస్తున్నప్పటికీ ఆ ఛానెల్ ఒక్కటే సరిపోదు.

 

ఇప్పటికిప్పుడు పత్రిక పెట్టాలనుకున్న పవన్ నిర్ణయం సరైనదే. టీవీ కంటే ప్రజలకు పత్రిక రీచ్ ఎక్కువగా ఉంటుంది. పవన్ ఆలోచలు, కార్యక్రమాలు, అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని పవన్ ప్రశ్నించినా ఆ విషయాలన్నీ ప్రజలకు చేరవేయటంలో పత్రిక ఎప్పుడు సహాయపడుతుంది

 

కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లెక్కకు మించిన పత్రికలున్నాయి. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలాంటి పత్రికలతో పోటీ పడాల్సి ఉంటుంది.పత్రికను తక్కువ ధరకు అందించటం , గ్రామ స్థాయి నుండి పత్రికను బలోపేతం చేస్తే మాత్రం జనసేన పార్టీకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ పత్రిక వల్ల జనసేన రాజకీయంగా ఇంకా బలంగ ఎదగటంలో కూడా పత్రిక ఉపయోగపడుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: