నీతులు చెప్పటం తేలిక కానీ చెప్పిన వాళ్ళు ఆ నీతులు పాటించటం చాలా కష్టం . ఈ సామెత రవిప్రాకాష్ కు బాగా సరిపోతుంది. తన కెరీర్లో రవిప్రాకాష్ ఎంతోమంది అక్రమార్కుల చిట్టా విప్పాడు. తన కథనాలతో సమాజానికి నీతులు చెప్పాడు. కానీ తనపై ఈరోజు అక్రమాలు చేసినట్లుగా అన్ని మీడియా ఛానెళ్ళు, పత్రికలు కథనాలు వండుతున్నాయి

 

రవిప్రాకాష్ మొత్తంగా మూడు కేసుల్లో ఇరుక్కున్నాడు.ఫోర్జరీ కేసు, లోగో రైట్స్ కేసు, షేర్లను శివాజీకి బదిలీ చేసిన కేసు. ఈ మూడు కేసులకు సాక్ష్యాలు బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. విచారణలో కొన్ని నేరాలను రవిప్రాకాష్ అంగీకరించినట్లు తెలుస్తుంది. ఒప్పుకోని నేరాలకు తగిన సాక్ష్యాలు పోలీసులు చూపించారట

 

తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉంటే రవిప్రకాశ్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. రవిప్రకాశ్ ఈ కేసు నుండి తప్పించుకోవటం దాదాపు అసాధ్యం . ఈ కేసులో మరో ముద్దాయిగా ఉన్న శివాజీ ఎప్పుడు విచారణకు హాజరవుతాడో చూడాలి. శివాజీ విచారణకు హాజరైతే ఈ కేసు గురించి మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఈ కేసు తుదిఫలితం ఏమవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: