2019 ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభివృధ్ధి కోసం పోరాటం చేసిన ముఖ్యుల్లో రోజా కూడా ఉన్నారు. ఈ సారి రోజాకు తప్పక మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు ఏ మంత్రి పదవి ఇవ్వలేదు.

 

నిజానికి రోజాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వైసీపీ తరుపున గెలిచిన వాళ్ళలో ఎక్కువగా ఎక్కువగా రెడ్లు ఉండటంతో రోజా గారిని పక్కన పెట్టాల్సి వచ్చిందట. జగన్ మాత్రం రోజా కోసం ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నాడట.

 

ప్రస్తుతం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నాడు. దీనికి సంబధించి ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని జగన్ అనుకుంటున్నాడట. రోజాకే కాక వైసీపీలో ముఖ్యులైన మరికొంత మందికి కూడా ఈ నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరచాలని వీళ్ళకు రెండున్నరేళ్ళ తరువాత మరలా కొత్త కేబినేట్ కు అవకాశం ఉండటంతో ఆ సమయంతో వీరికి మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నాడట. ఏదేమైనా జగన్ నిర్ణయం మంచిదే కదా


మరింత సమాచారం తెలుసుకోండి: