ప్రధాని మోడీ నిన్న తిరుపతి వచ్చారు.  తిరుపతి విమానాశ్రయంలో విమాన దిగగానే జగన్ నడుము వంచేశాడు. మోడీ కాళ్లకు దణ్ణం పెట్టేందుకు ప్రయత్నించాడు.  కానీ, మోడీ వద్దని వారించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.  ఈ ఇప్పుడు ఈ చిన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


ప్రోటోకాల్ ప్రకారం మోడీని గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రధానిని చూడగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం వంచేశారు. గవర్నర్, ఇతర భాజాపా నేతలు, మంత్రులతో సహా అంతా ప్రోటోకాల్ మేరకు పుష్ప గుచ్చాలు ఇచ్చి, శాలువాలు కప్పి నమస్కరించి మోడీకి ఆహ్వానం పలికితే జగన్ మాత్రం ఏకంగా కాళ్ళ మీద పడే ప్రయత్నం చేసి అందరిని ఆశ్చర్య పరచడం విశేషం.  


ఇప్పుడు ఈ న్యూస్ గురించి వివిధ రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.   ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా కాళ్ళమీద పడేందుకు ప్రయత్నిస్తే... నాలుగు గోడల మధ్య ఇంకెలా ఉంటుందో అని ట్రోల్ చేస్తున్నారు.  జగన్ ఇలా ఎందుకు చేశాడు.  మోడీ వయసులోను, అనుభవంలోను, పదవిలోనూ అందరికంటే పై స్థాయిలో ఉన్నారు.  


అలాంటి వ్యక్తికి మొక్కడం మంచిదే.  పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం తప్పేమి కాదు.  తప్పుకాదు కాబట్టే జగన్ అలా చేయబోయాడు.  కానీ, మనవాళ్ళు అలా ఆలోచించరు కదా.  ఏదో జరిగిపోయింది అందుకే అలా జరిగింది అని న్యూస్ ను స్పెర్డ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: